Udayanidhi Stalin: మీ కొడుకు క్రికెట్లో ఎన్ని పరుగులు చేసాడు? అమిత్ షా ను ప్రశ్నించిన ఉదయనిధి స్టాలిన్
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.

Udayanidhi Stalin: డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
ఎన్ని మ్యాచ్ లు ఆడాడు ?( Udayanidhi Stalin)
చెన్నైలో డీఎంకే యువజన విభాగం కొత్త ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ఉదయనిధి మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యానని, ఆ తర్వాతే తనకు మంత్రి పదవి లభించిందని ఉద్ఘాటించారు.నన్ను ముఖ్యమంత్రిని చేయడమే మా పార్టీ నేతల లక్ష్యం అని అమిత్ షా అన్నారు. అయితే మీ అబ్బాయి బీసీసీఐకి ఎలా సెక్రటరీ అయ్యాడు అని అమిత్ షాను అడగాలనుకుంటున్నాను. అతను ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు? ఎన్ని పరుగులు చేశాడు? సమాధానం చెప్పాలని ఉదయనిధి డిమాండ్ చేశారు
శుక్రవారం రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలై పాదయాత్రను ప్రారంభించిన అమిత్ షా వారసత్వరాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, డీఎంకే మిత్రపక్షాలు వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని, డీఎంకేను వంశపారంపర్య పార్టీ అని ఆయన ఆరోపించారు. దీనికి కౌంటర్ గా ఉదయనిధి స్టాలిన్ పై వ్యాఖ్యలు చేసారు.
.
ఇవి కూడా చదవండి:
- Telugu Film Chamber of Commerce: కొనసాగుతున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్
- PSLV-C56 Rocket: పీఎస్ఎల్వీ-సి56 రాకెట్ ప్రయోగం విజయవంతం