Last Updated:

Haryana Minister: పీవోకే పై హర్యాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్‌తక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

Haryana Minister: పీవోకే పై హర్యాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

Haryana Minister: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్‌తక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

 

మోదీ నాయకత్వంలోనే(Haryana Minister)

‘2014కు ముందు భారత్ అంతబలంగా లేదు. కానీ ఇప్పుడు పటిష్టంగా మారింది. కశ్మీర్‌లోని కొంతభాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించింది. అక్కడ భారత్‌తో కలవాలనే ఆకాంక్షలు వినిపిస్తున్నాయి.

రానున్న రెండు,మూడు ఏళ్లలో ఏ క్షణమైనా పీఓకే.. భారత్‌లో భాగం అవుతుంది. అది కూడా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోనే సాధ్యం అవుతుంది’ అని గుప్తా వ్యాఖ్యానించారు.

అదే విధంగా గుప్తా.. కాంగ్రెస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.

మెరుపు దాడులు (సర్జికల్‌ స్ట్రైక్స్‌) చేసి చాలా మంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్రం.. దానికి సాక్ష్యాలను చూపించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వచ్చిన డిమాండ్లను తప్పుపట్టారు.

అలాగే ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన భారత్‌ జోడో యాత్ర గురించి స్పందిస్తూ ‘భారతదేశాన్ని ఏకం చేస్తామంటూ మాటలు చెప్పేవారే దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు’ అని కమల్ గుప్తా మండిపడ్డారు

 

బాల్టిస్థాన్‌ ప్రాంతవాసుల ఆందోళన

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతవాసులు భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాలను దోచుకుంటున్న పాక్‌ సర్కారు దమననీతిపై మండిపడుతున్నారు.

తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కార్గిల్‌ రోడ్డును తిరిగి తెరవాలని, భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని కలిపేయాలని వారు అడుగుతున్నారు.

ఆ ప్రాంతంలో 12 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి.

గోధుమ, ఇతర నిత్యావసర వస్తువులపై సబ్సిడీల పునరుద్ధరించాలని, ఈ ప్రాంతంలోని సహజవనరుల దోపిడీ, భూముల ఆక్రమణను ఆపాలని వారు నినదించారు.

గిల్గిత్‌ ప్రజలపై పాక్‌ సైనిక అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు.