Last Updated:

Elephant: అటవీశాఖ ఏనుగుకు అద్బుతమైన పదవీ విరమణ వీడ్కోలు

అనామలై కలీం.. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడం లేదా తరిమికొట్టడం కోసం 99 విజయవంతమైన ఆపరేషన్‌లకు నాయకత్వం వహించి 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసింది.

Elephant: అటవీశాఖ ఏనుగుకు అద్బుతమైన పదవీ విరమణ వీడ్కోలు

Elephant: అనామలై కలీం.. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడం లేదా తరిమికొట్టడం కోసం 99 విజయవంతమైన ఆపరేషన్‌లకు నాయకత్వం వహించి 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసింది. ఈ ఏనుగు పదవీ విరమణకు గుర్తుగా కోజికముతి ఏనుగు శిబిరంలోఐదు ఫారెస్ట్ రేంజర్లు మరియు ఇతర ఏనుగులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు.

కలీం ఒక లెజెండ్..(Elephant)

రాష్ట్ర పర్యావరణ కార్యదర్శి సుప్రియా సాహు కలీం పదవీ విరమణను చూపుతూ ఒక వీడియోను ట్వీట్ చేశారు, అతను ఒక లెజెండ్ అని మరియు అతని సేవకు ప్రజల హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయని అన్నారు. క్లిప్ 161k పైగా వీక్షణలు మరియు 9,300 లైక్‌లతో వైరల్‌గా మారింది. “తమిళనాడులోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ఐకానిక్ కుమ్కీ ఏనుగు కలీం 60 ఏళ్ల వయసులో ఈరోజు పదవీ విరమణ చేయడంతో మా కళ్లు చెమ్మగిల్లాయి మరియు హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. 99 రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న అతను ఒక లెజెండ్. అతను గౌరవ గార్డు అందుకున్నాడు. #TNForest #Kaleem” అని ట్వీట్ చేశారు.

50 సంవత్సరాలు సేవలోనే..

కలీం డిసెంబర్ 1972లో పట్టుబడిన తరువాత కోజికముతి ఏనుగు శిబిరంలో పళనిసామి శిక్షణ ఇచ్చాడు. పళనిసామి మరణానంతరం ఆయన మేనల్లుడు మణి కలీం శిక్షకుడిగా మారాడు. కలీం కేవలం తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలలో కూడా కార్యకలాపాలలో పాల్గొంది. మొత్తంమీద ఐదు దశాబ్దాలుగా సాగిన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలికింది.

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ రోజు ఉదయం మూడు ఆడ ఏనుగులు ఎలక్ట్రిక్ షాక్‌ గురై మృతి చెందాయి. మారండహల్లిలో వ్యవసాయ భూమికి అక్రమంగా నిర్మించిన ఎలక్ర్టిక్‌ ఫెన్సింగ్‌ని ఏనుగులు తాకి చనిపోయాయని అధికారులు తెలిపారు. మూడు ఏనుగులతో పాటు వెళ్లిన రెండు బేబీ ఎలిఫెంట్లు మాత్రం ప్రమాదం నుంచి తప్పుకున్నాయి.

ఇదిలా ఉండగా రైతు మురుగన్‌ అక్రమంగా తన వ్యవసాయ భూమికి ఎలక్ర్టిక్‌ ఫెన్సింగ్‌ నిర్మించాడని అటవీ అధికారులు తెలిపారు. పొలాల్లోకి అడవి పందులు, ఏనుగులు వస్తున్నందుకు ఆయన ఎలక్ర్టిక్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. కాగా పోలీసులు మురగన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడు జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో రెండు బేబీ ఎలిఫెంట్లు ప్రాణాలతో బయటపడ్డాయి. అటవీ అధికారుల సమాచారం ప్రకారం మూడు ఆడ ఏనుగుల వయసు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు. బేబీ ఎలిఫెంట్ల వయసు తమ్మిది నెలలు ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు పిల్ల ఏనుగులను ఏనుగుల గుంపుతో కలిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు చిన్న ఏనుగులు ప్రత్యేకంగా తమంతట తాము బతికే అవకాశం లేదని చెబుతున్నారు.