Last Updated:

Maharashtra: భక్తులకు ప్రసాదంగా డబ్బులు పంపిణీ.. క్యూ కట్టిన ప్రజలు.. ఎక్కడంటే..?

సాధారణంగా గుడికి వెళ్లే భక్తులకు పూజారులు తీర్ధ ప్రసాదాలు అందిస్తారు. కానీ ప్రసాదంగా డబ్బు పంచండం ఎక్కడైనా చూశారా అలా డబ్బు పంచుతున్నట్టు తెలిస్తే ప్రజలు క్యూ కడతారు. సరిగ్గా ఈ తరహాలోనే ఓ గుడిలోని భక్తులకు డబ్బు పంపిణీ చేశారు. మరి అది ఎక్కడో ఎందుకు అలా డబ్బు పంచిపెట్టారో చూద్దామా..

Maharashtra: భక్తులకు ప్రసాదంగా డబ్బులు పంపిణీ.. క్యూ కట్టిన ప్రజలు.. ఎక్కడంటే..?

Maharashtra: సాధారణంగా గుడికి వెళ్లే భక్తులకు పూజారులు తీర్ధ ప్రసాదాలు అందిస్తారు. కానీ ప్రసాదంగా డబ్బు పంచండం ఎక్కడైనా చూశారా అలా డబ్బు పంచుతున్నట్టు తెలిస్తే ప్రజలు క్యూ కడతారు. సరిగ్గా ఈ తరహాలోనే ఓ గుడిలోని భక్తులకు డబ్బు పంపిణీ చేశారు. మరి అది ఎక్కడో ఎందుకు అలా డబ్బు పంచిపెట్టారో చూద్దామా..

మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న కాళీమాత ఆలయంలో పూజారి భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంపిణీ చేశారు. సోమవారం దీపావళి పండగ సందర్భంగా గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంపిణీ చేశారు. కాగా ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ నాడు సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ ఆలయ పూజారి శక్తి మహారాజ్‌ భక్తులకు డబ్బులు పంచారు. పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి.. ఒక్కొక్కరికీ రెండు లేదా మూడు నోట్లు పంచారు. ఇక ఈ డబ్బు ప్రసాదాన్ని పొందడానికి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అయితే దీపావళి రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచి జరుగుతుందని పూజారి తెలిపారు. అందువల్లే ప్రతి ఏటా ఇలా ప్రసాదంగా డబ్బు పంపిణీ చేస్తామని తెలిపారు.

1984 నుంచి కాళీమాత ఆలయ ప్రధాన పూజారి శక్తి మహారాజ్.. దీపావళి రోజు రాత్రి బరాకత్ (ధన ప్రసాదం) పంచే పద్ధతిని ప్రారంభించారు. దీపావళి రోజు రాత్రి ఆలయానికి వచ్చే భక్తులపై కాళీమాత అనుగ్రహం ఉండేందుకు ధన ప్రసాదం పంపిణీ చేయమని ఆయన తెలిపారు. కాళీమాత ఆలయంలో ప్రసాదం ఇవ్వడం గత 38 ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సంక్రాంతికి.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం?

ఇవి కూడా చదవండి: