Last Updated:

Bengaluru Metro: బెంగళూరులో కూలీన మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి

Bengaluru Metro: బెంగళూరులో కూలీన మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి

Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మెట్రో పిల్లర్ రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

బాధిత కుటుంబానికి పరిహారం

ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి హరిహారం అందజేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. మరో వైపు బెంగళూరు మెట్రో సైతం బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందిస్తామని తెలిపింది.

 

ఈ ఘటనపై కాంగ్రెస్ విమర్శలు

ఈ ఘటనపై ఈ రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డికే శివకుమార్ అన్నారు. 40% కమీషన్ ప్రభుత్వ తీసుకోవడం వల్లే ఈ ఫలితం అని ఆయన అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేస్తున్నారని.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.

నిర్మాణంలో ఉన్న పిల్లర్ మహిళ, చిన్నారిపై పడిపోవడం షాకింగ్ ఘటన అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి అన్నారు. ఇది బిజెపి ప్రభుత్వ ఉల్లంఘన, నిర్లక్ష్యం అవినీతికి నిదర్శనమని ఆమె అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. నిర్మాణంలో ఉన్నది కూలితేనే.. నిర్మించాకా వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి:

 బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

 తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

 

 

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: