Last Updated:

Jammu and Kashmir Encounter: జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ కెప్టెన్ తో సహా నలుగురు జవాస్ల వీరమరణం

జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ ప్రారంభమయింది.

Jammu and Kashmir Encounter: జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ కెప్టెన్ తో సహా నలుగురు జవాస్ల వీరమరణం

Jammu and Kashmir Encounter:జమ్ము కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక అధికారితో సహా నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. సోమవారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దళాలు మరియు జమ్ము అండ్ కశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ జాయింట్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ ప్రారంభమయింది.

ఆర్మీ డే నాడు పుట్టి..(Jammu and Kashmir Encounter)

ఇటీవల పదోన్నతి పొందిన 10 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్ బ్రిజేష్ థాపా ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. అతని కుటుంబం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరంలో నివసిస్తోంది.తన కొడుకు జనవరి 15న ఆర్మీ డే రోజున జన్మించాడని, అతను ఆర్మీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని తల్లి నీలిమా థాపా అన్నారు.
బ్రిజేష్ థాపా మార్చిలో సెలవు తర్వాత తిరిగి డ్యూటీకి వచ్చాడని, ఈ నెలాఖరులో ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నామని అయితే విధి వేరేలా తలిచిందని ఆమె చెప్పారు. .

జైషే మహ్మద్ (జెఇఎం) షాడో టెర్రర్ సంస్థ కాశ్మీర్ టైగర్స్‌కు చెందిన ఎక్స్ హ్యాండిల్స్ ఉగ్రవాద దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. అధికారులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు. జులై 8న కతువాలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఆకస్మిక దాడికి తాము బాధ్యులమని ఇంతకుముందు ఈ సంస్ద ప్రకటించింది.

గత మూడు వారాల్లో దోడా జిల్లా అడవుల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన మూడో అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇది. కతువా జిల్లాలోని రిమోట్ మాచెడి ఫారెస్ట్ బెల్ట్‌లో ఆర్మీ పెట్రోలింగ్‌పై ఉగ్రవాది మెరుపుదాడి చేసిన వారం రోజులకే తాజా సంఘటన జరిగింది, ఇది ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొంది మరియు చాలా మంది గాయపడ్డారు. ముఖ్యంగా, భద్రతా దళాలు దశాబ్దాల తీవ్రవాదాన్ని తుడిచిపెట్టిన తర్వాత 2005 మరియు 2021 మధ్య సాపేక్షంగా శాంతియుతంగా ఉన్న జమ్మూ ప్రాంతం, గత నెలలో తీవ్రవాద దాడులను చూసింది.

ఇవి కూడా చదవండి: