Last Updated:

Onion Market: ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకానికి నిరసనగా ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిమార్కెట్ మూసివేత..

ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌లోని లాసల్‌గావ్‌కు చెందిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ( ఎపిఎంసి) ఉల్లిపై కేంద్రం 40 శాతం ఎగుమతి సుంకం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారాన్ని నిరవధికంగా నిలిపివేసింది.లాసల్‌గావ్‌లోని మార్కెట్‌తో పాటు, నాసిక్ జిల్లాలోని ఇతర ఏపీఎంసీలు కూడా ఉల్లి విక్రయాలను బహిష్కరించాయి.

Onion Market: ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకానికి నిరసనగా ఆసియాలోనే అతిపెద్ద ఉల్లిమార్కెట్ మూసివేత..

Onion Market: ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన నాసిక్‌లోని లాసల్‌గావ్‌కు చెందిన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ( ఎపిఎంసి) ఉల్లిపై కేంద్రం 40 శాతం ఎగుమతి సుంకం విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారాన్ని నిరవధికంగా నిలిపివేసింది.లాసల్‌గావ్‌లోని మార్కెట్‌తో పాటు, నాసిక్ జిల్లాలోని ఇతర ఏపీఎంసీలు కూడా ఉల్లి విక్రయాలను బహిష్కరించాయి.

దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదల నేపథ్యంలో ఆగస్టు 19న ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం కిలో ఉల్లి గరిష్ట ధర రూ.67 దాటింది. భారతదేశం అంతటా మోడల్ ధర కిలోగ్రాముకు రూ. 31గా ఉంది. గత ఏడాది ఇది రూ.24గా ఉంది. డిసెంబర్ 31, 2023 వరకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉల్లి రైతులు మరియు దాని ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాపారులు పేర్కొన్నారు.నాసిక్‌లో ఉల్లి వేలాన్ని నిరవధికంగా మూసివేయాలని నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం సమావేశంలో ఆగస్టు 20న నిర్ణయం తీసుకున్నట్లు దాని అధ్యక్షుడు ఖండూ డియోర్ తెలిపారు.ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది. బయటి సరుకులను పరిమితం చేయడానికి మరియు కూరగాయల స్థానిక లభ్యతను పెంచడానికి ఈ సుంకం ఉద్దేశించబడింది.  2023-24 సీజన్‌కు బఫర్ స్టాక్‌లను మూడు లక్షల టన్నుల నుంచి ఐదు లక్షల టన్నులకు పెంచాలని కూడా నిర్ణయించారు.

కేంద్రం స్పందన ఏమిటంటే..(Onion Market)

మరోవైపు కేంద్రం అమ్ముడుపోని ఉల్లిపాయల స్టాక్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలిపింది. క్వింటాల్‌కు అత్యధికంగా రూ2,410 ధర చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు మూడు లక్షల టన్నుల ఉల్లి కొనుగోళ్లు జరిగాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ధృవీకరించారు. ఉల్లి ఎగుమతి సుంకంపై కొంతమంది రాజకీయనేతలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లోని రైతులందరూ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని కోరారు. ఉల్లిని కొనుగోలు చేయాలని NCCF (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్) మరియు NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) లనుఆదేశించినట్లు ఆయన స్పష్టం చేసారు.