Air india Flight Food: ఎయిర్ ఇండియా విమానం భోజనంలో బ్లేడ్ ..
మన దేశంలోని హోటళ్లలో భోజనం చేస్తుంటే ఒక్కొసారి సాంబారులో బల్లులు, బొద్దింకలు తరచూ చూస్తుంటాం. అదే ప్రస్తుతం టాటా గ్రూపు నడుపుతున్న ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
Air india Flight Food: మన దేశంలోని హోటళ్లలో భోజనం చేస్తుంటే ఒక్కొసారి సాంబారులో బల్లులు, బొద్దింకలు తరచూ చూస్తుంటాం. అదే ప్రస్తుతం టాటా గ్రూపు నడుపుతున్న ఎయిర్ ఇండియా కూడా ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలు దేరిన ఎయిర్ ఇండియా… ప్రయాణికులకు నాసిరకం భోజనం పెట్టారని జర్నలిస్టు మథురేస్ పాల్ సోషల్‌మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. విమానంలో సర్వ్ చేసిన రొస్టెడ్ స్విట్ పొటాటో… లేదా కాల్చిన చిలగడ దుంపతో పాటు ఫిగ్ చాట్ తింటున్న సమయంలో తన నోటికి మెటల్ పీసెస్ తగిలాయి.. తర్వాత ఈ మెటల్ బ్లేడ్ అని తేలిందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు తనకు ఏమీ కాలేదన్నారు. తప్పంతా ఎయిర్ ఇండియా కేటరింగ్‌సర్వీస్‌దని.. దీన్ని తాను ఎయిర్ ఇండియాకు ఆపాదించనని చెప్పాడు పాల్.
బిజినెస్ క్లాస్ టికెట్.. ..(Air india Flight Food)
అయితే పాల్ ఆందోళన ఏమిటంటే ఇదే ఫుడ్ చిన్నపిల్లవాడు మింగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తన నోటికి మెటల్ పీస్ తగిలిన వెంటనే తాను ఊసేశానని చెప్పాడు. తనకు విమానంలో సర్వ్ చేసిన ఆహారం ఫోటోలను ఆయన సోషల్‌మీడియాలోపోస్ట్ చేశాడు. కాగా పాల్ పోస్ట్‌పై ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. వెంటనే వన్ వే బిజినెస్ క్లాస్ టికెట్ ఆఫర్ చేసింది. ఏడాదిలోగా ప్రయాణించే వెసలుబాటు కల్పించింది. అయితే ఈ ఆఫర్‌ను పాల్ తిరస్కరించాడు. ఇది తనకు లంచం ఇవ్వడమేనని మండిపడ్డాడు .
ఇదిలా ఉండగా ఎయిర్‌లైన్ మాత్రం కెటరింగ్ వెండర్ కూరగాయలు కోస్తున్నప్పుడు వాడే బ్లేడ్ అని వివరించింది. ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి సర్వ్ చేసిన భోజనంలో బ్లేడ్ కనిపించిందని అంగీకరించింది. తమ విచారణలో కూరగాయలు కోసే బ్లేడ్ అని తేలిందని చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మీడియాకు చెప్పారు. కాగా ఎయిర్ ఇండియా పాల్‌కు క్షమాపణ చెప్పింది. బుకింగ్ వివరాలు… సీటు నంబరు ఇస్తే.. దీనిపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది.