Noor Malabika Das: బాలీవుడ్ నటి నూర్ మలాబికాదాస్ ఆత్మహత్య
బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్‌వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Noor Malabika Das: బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్‌వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పొరుగున ఉన్న వారు ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి తలుపుతెరచి చూస్తే ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కాగా ఆమె ఆత్మహత్య చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
స్పందించని కుటుంబ సభ్యులు..(Noor Malabika Das)
ఇక .విషయానికి వస్తే ఆమె అస్సాంకు చెందిన వారు మాజీ ఎయిర్ హోస్టెస్, ఇటీవల కాలంలో ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా పలు వెబ్ సీరియల్స్ కూడా నటించారు. 2023 లీగల్ డ్రామా ది ట్రయల్‌లో ఆమె కాజోల్‌తో కలిసి నటించారు. 37 ఏళ్ల ఈ నటి అస్సాంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మిడ్ డే పత్రిక సమాచారం ప్రకారం పోలీసులు ఆమె బౌతిక కాయాన్ని లోకండ్‌వాలా ఫ్లాట్ నుంచి ఈ నెల 6 నస్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు సోమవారం నాడు తెలిపారు. కాగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించినా.. వారు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆదివారం నాడు మమ్మదాని హెల్త్ అండ్ ఎడ్యూకేషన్ ట్రస్ అనే ఎన్‌జీఓ సాయంతో పోలీసులు ముంబై నగరంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా తాము కుటుంబసభ్యులతో మాట్లాడామని.. రెండు వారాల క్రితమే స్వగ్రామానికి వచ్చామని పోలీసులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు మిడ్ డేకు తెలిపారు.
ఇదిలా ఉండగా నూర్ మాలబికా దాస్‌కు అత్యంత సన్నిహితుడైన యాక్టర్ అలోక్‌నాథ్ పాఠక్ ఆమె మృతి పట్ల స్పందించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె తనకు పరిచయమని అన్నారు. ఆమెతో కలిసి పలు చిత్రాలు, సీరీస్‌లలో నటించానని.. గత నెల వరకు ఆమె కుటుంబం ఆమెతో కలిసి ముంబైలో ఉన్నారని పాఠక్ చెప్పారు. వారం క్రితమే వారు ఊరికి వెళ్లారని .. ఆమె ఒక్కరే ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారని అలోక్‌నాథ్ పాటక్ వివరించారు.
ఇదిలా ఉండగా నూర్ మాలబికా దాస్ పలు హిందీ సినిమాలతో పాటు పలు వెబ్ సీరీస్‌లలో కూడా నటించారు. వారిలో సిస్కియన్, వాకామన్, థీకీ చట్ని, జాగహన్యయా ఉపాయా, చారమ్‌సుఖ్, జిస్సు సేన్‌గుప్తాతో కలిసి ఆమె ది ట్రయల్‌లో నటించారు. ఇదిలా ఉండగా ఆల్ ఇండియా సినీవర్కర్స్ యూనియన్ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ఒక వినతి పత్రం సమర్పించి మాలబికా దాస్ మృతిపై లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.