BJP MPs: 10 మంది బీజేపీ ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసారు.. ఎందుకో తెలుసా?
రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.
BJP MPs: రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యులలో (ఎంపిలు) పది మంది తమ లోక్‌సభ స్థానాలకు బుధవారం రాజీనామా చేశారు.
రాజీనామాలు సమర్పించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం స్పీకర్‌ను కలిసింది.స్పీకర్‌ను కలిసిన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి, చత్తీస్‌గఢ్ నుండి అరుణ్ సావో మరియు గోమతి సాయి ఉన్నారు.ధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింగ్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత నేను లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశాను. త్వరలో నేను కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. బాబా బాలక్‌నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామాలు సమర్పించలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కేంద్రమంత్రి ..(BJP MPs)
బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు కేంద్ర మంత్రులతో సహా 21 మంది ఎంపీలను రంగంలోకి దించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి ఏడుగురు చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీలు పోటీ చేసారు. తెలంగాణ, రాజస్దాన్ లో ముగ్గురు చొప్పున, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్‌లో ఒకరు బీజేపీ ఎంపీలు ఓడిపోయారు.కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మధ్యప్రదేశ్ లోని నివాస్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి లను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించింది. వీరు ముగ్గురూ తమ తమ స్థానాలను గెలుచుకున్నారు. వీరిలో గురువారం తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి తాజాగా తన రాజీనామాను సమర్పించారు. మిగిలిన ఇద్దరు రాజీనామాలు చేయవలసి ఉంది.