Kodikatthi case: సీఎం జగన్ కు షాక్ .. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదన్న ఎన్‌ఐఏ
కోడికత్తి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఘటనతో సంబంధం లేదని ఎన్‌ఐఏ తెలిపింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని విచారణలో తేలిందని పేర్కొంది.

Kodikatthi case:కోడికత్తి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఘటనతో సంబంధం లేదని ఎన్‌ఐఏ తెలిపింది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని విచారణలో తేలిందని పేర్కొంది. ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్‌ఐఏ అభిప్రాయపడింది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని ఎన్‌ఐఏ విజ్నప్తి చేసింది. వాదనలకు సమయం కావాలని జగన్ న్యాయవాదులు కోరారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
టీడీపీతో సంబంధం లేదు..(Kodikatthi case)
కేసును క్షుణ్ణంగా విచారించామని, సాక్షులందరినీ విచారించిన తర్వాతే చార్జిషీటు దాఖలు చేశామని ఎన్‌ఐఏ తెలిపింది. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు, హోటల్ ఉద్యోగి జానిపల్లి శ్రీనివాస్‌రావుకు తెలుగుదేశం పార్టీతో లేదా మరే ఇతర రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొంది.రెస్టారెంట్ యజమాని టి హర్షవర్ధన్ ప్రసాద్ టిడిపి సానుభూతిపరుడే అయినప్పటికీ, కేవలం కార్మికుడు మాత్రమే అయిన నిందితుడితో అతనికి ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది.ఇప్పటికే కోర్టులో విచారణ ప్రారంభమైనందున, ఈ కేసుపై మరో దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది. శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీమ్ కూడా జగన్ మోహన్‌రెడ్డి పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్ కు అర్హత లేదని అన్నారు.
ఏప్రిల్ 10న హాజరుకావాలని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని గతంలో ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని, అలాగే హాజరు కావడానికి అవకాశం ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కోర్టు ప్రాంగణం చుట్టూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కలుగుతోందన్నారు. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని సీఎం జగన్ కోర్టును అభ్యర్థించారు.
ఇవి కూడా చదవండి:
- Survey Report : ఆ విషయాల్లో టాపర్స్ గా తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఆస్తుల్లో జగన్,, కేసుల్లో కేసీఆర్ !
- IPL 2023 CSK vs RR: తొలి కెఫ్టెన్ గా ధోని అరుదైన రికార్డు
- Midday Meal: మధ్యాహ్న భోజనంపై పశ్చిమబెంగాల్ తప్పుడు లెక్కలు.. రూ.100 కోట్లకు పైగా అధికంగా రిపోర్టులు