Home / తప్పక చదవాలి
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ముగ్గురు జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు. థానమండి-సురన్‌కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న బఫ్లియాజ్ ప్రాంతం నుండి జవాన్లను తీసుకువెడుతుంగా ఈ దాడి జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తోంది.
డబ్ల్యుఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏడాది ప్రారంభంలో అనేక వాయిదాల తర్వాత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు గురువారం డిసెంబర్ 21న జరిగాయి.
వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమీషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లు, 2023 గురువారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ నెల ప్రారంభంలో ఈ బిల్లుపై ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ, రాజ్యసభ ఆమోదించింది.
న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్ యొక్క భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.సీఐఎస్ఎఫ్ నిపుణులు మరియు పార్లమెంట్ భద్రతా బృందంలోని అధికారులతో పాటు అగ్నిమాపక అధికారులు ఈ వారం చివరిలో సర్వేను చేపట్టనున్నారు.
బిగ్‌బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచన రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.
దేశంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం తమదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించిన నేపధ్యంలో ఆయన సమాధానమిచ్చారు. నీతి అయోగ్ తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నివేదిక పంపించిందని తెలిపారు.
విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు.