Home / తప్పక చదవాలి
ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు.
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని మంటలు అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రని పోషించారు. వైసీపీకి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలను ఖలిస్థానీ అనుకూల నినాదాలతో నింపారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారాయణ మందిర్ గోడలపై రాసి ఉన్న నినాదాలను చూపిస్తూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో చిత్రాలను షేర్ చేసుకుంది.
పాకిస్థాన్ లోని సింధ్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా మొదటి హిందూ మహిళ మనీషా రోపేటాను నియమించారు.రోపెటా పాకిస్తాన్ యొక్క పితృస్వామ్య అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాకుండా, 26 సంవత్సరాల వయస్సులో అధికార పదవిలో నియమితులైన మొదటి హిందూ మహిళగా కూడా రికార్డు సృష్టించారు.
'మానవ అక్రమ రవాణా' అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .
సూర్యగ్రహంపై పరిశోధనలకోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ 2024 జనవరి 6న తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ ఎల్ వన్‌కి మిషన్ చేరుతుందని సోమనాథ్ వివరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ మరియు రాజౌరీ జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.గురువారం మధ్యాహ్నం పూంచ్‌లోని సురన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలీ మరియు బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఆర్మీ వాహనాలపై సాయుధ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని రేవంత్ అన్నారు.