Last Updated:

Nadendla Manohar: ఏపీలో నెలరోజుల్లో 19 వేల ఫించన్లలో కోత..నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.

Nadendla Manohar: ఏపీలో నెలరోజుల్లో 19 వేల ఫించన్లలో కోత..నాదెండ్ల మనోహర్

 Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.

రూ.291 కోట్లు కాజేశారు..( Nadendla Manohar)

నవంబర్‌లో పింఛన్ల ద్వారా రూ.1503 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. మొత్తం 54.69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు.డిసెంబర్ నాటికి పింఛన్ల సంఖ్య 19,871కి తగ్గింది. డిసెంబర్‌లో 54.50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అంటే నెలరోజుల్లో 19 వేల మంది లబ్దిదారులను తగ్గించారు.కేబినెట్ భేటీలో పింఛన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచినట్లు చెప్పారు.కార్పొరేషన్ల ద్వారా రూ.1,896 కోట్లు పింఛన్ ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.కేబినెట్ భేటీలో ఆమోదించిన పింఛన్ల సంఖ్య 54.69 లక్షలు మాత్రమే.అర్హత ఉన్నవారికి కూడా పింఛన్లు నిలిపివేశారు. ఈ రకంగా పింఛన్ల కోత ద్వారా రూ.291 కోట్లు కాజేశారని మనోహర్ వివరించారు.వైసీపీ ప్రభుత్వం అసత్యాలతో ప్రజలను మోసగిస్తోందన్నారు.