Last Updated:

Zomato Agent: గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో ఏజెంట్

హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో జొమాటో లోగో ఉన్న బ్యాగ్‌తో నగరంలోని వీధుల్లో ఒక వ్యక్తి గుర్రంపై దూసుకుపోతున్న వీడియో వైరల్‌గా మారింది. . చిన్న క్లిప్‌లో జోమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై చంచల్‌గూడ వద్దకు ఫుడ్ డెలివరీకి వచ్చినట్లు చూపించారు.

Zomato Agent: గుర్రంపై  వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన  జొమాటో ఏజెంట్

Zomato Agent:హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో జొమాటో లోగో ఉన్న బ్యాగ్‌తో నగరంలోని వీధుల్లో ఒక వ్యక్తి గుర్రంపై దూసుకుపోతున్న వీడియో వైరల్‌గా మారింది. . చిన్న క్లిప్‌లో జోమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై చంచల్‌గూడ వద్దకు ఫుడ్ డెలివరీకి వచ్చినట్లు చూపించారు.

మూడు గంటలు క్యూలో ఉన్నా..(Zomato Agent)

గుర్రంపై వచ్చిన వ్యక్తి వీధుల్లో ప్రజలకు ఊపుతూ కనిపించాడు.వీడియోలో, డెలివరీ ఏజెంట్ పంప్‌లలో పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆహారాన్ని డెలివరీ చేయడానికి గుర్రంపై రావడానికి సిద్దమయినట్లు ఒక వ్యక్తితో మాట్లాడటం వినబడింది.పెట్రోల్ లేదు. నేను ఆర్డర్ తీసుకున్న తర్వాత మూడు గంటలపాటు క్యూలో వేచి ఉన్నాను. కానీ పెట్రోల్ పొందలేకపోయినట్లు  చెప్పాడు.

హైదరాబాద్‌లోని పెట్రోల్, డీజిల్ కోసం ఇంధన విక్రయ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో వాహనదారులు గుమిగూడటంతో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై పెద్ద ఎత్తున క్యూలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. సాయంత్రానికి ట్రాఫిక్‌ జామ్‌ అదుపులోకి వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.పెట్రోల్ ఉంది. ట్రక్కు డ్రైవర్ల ఆందోళన కారణంగా, అది అందుబాటులో ఉండకపోవచ్చని ప్రజలు భయపడుతున్నారు. దీనితో వారు పెద్ద సంఖ్యలో పెట్రోల్ పంపులకు వెళుతున్నారు, దీని తరువాత క్యూలు ఏర్పడి ట్రాఫిక్ జామ్ కు దారితీసిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.