Last Updated:

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 22 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope: వార ఫలాలు.. ఈ వారం రాశి ఫలాలు( ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 22 వరకు) ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in Telugu, 2025 February 16 to February 22: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 22 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం: మేష రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధన వ్యయం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు పరీక్షా కాలం కాబట్టి సంతాన విషయంలో తల్లిదండ్రులు అధిక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా కానీ అందులో అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కాలం అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో కూడా ఆలోచించి, ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అవసరానికి మించి సహాయం చేయడం వలన కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి. చేతి వరకు వచ్చిన ఉద్యోగ అవకాశం చేజారిపోయే పరిస్థితి గోచరిస్తుంది, జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఇంట బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి లేకపోయినప్పటికీ బంధువర్గంలో కానీ మిత్ర వర్గంలో కానీ విభేదాలు వచ్చే పరిస్థితి సూచిస్తుంది కాబట్టి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాధరణ లభిస్తుంది. చిరుధాన్య వ్యాపారస్తులకు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు బాగుంటాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి హెచ్1బి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడాను ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీరు కోరుకున్న పదవి ఈ వారం లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వ్యాపార పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పటినుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గడిచిన వారాల కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే.

కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు గానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏప్రిల్ తర్వాత మొదలుపెట్టండి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడతారు మీ కష్టానికి తగినట్టుగానే వారు పేరు ప్రఖ్యాతలు పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ కలర్.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. ఎప్పుడూ లేనివిధంగా ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. స్థిరాస్తులు అమ్మే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాలపరంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ వారం శుభవార్త వింటారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తు అనేది బంగారు బాటలాగా ఉంటుంది. విద్యార్థి విద్యార్థులు ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈవారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ఆదిత్య హృదయమును చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య: కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఒత్తిడి ఏమీ ఉండదు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు మీ కెరియర్ మీద ప్రభావం చూపించే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార పరంగా నూతన బ్రాంచీలను నెలకొల్పడానికి లేదా వ్యాపార విస్తరణ చేయడానికి ఈవారం అనుకూలమైన సమయం గా చెప్పవచ్చు. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు కష్టేఫలి అన్నట్టుగా ముందుకు వెళ్లాలి. దైవానుగ్రహం వల్ల ఈ రాశి వారికి మేలే జరుగుతుంది. శుక్రవారం రోజున శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎల్లో.

తుల: ఈ రాశి వారికి ఈ వారం బాగుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకున్న స్థానం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు నిరాశ పరుస్తాయి. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేముందు కొంత సమయం తీసుకుని, నలుగురి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్లడం చెప్పదగినది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నీకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. విదేశీ సంబంధమైన విషయ వ్యవహారాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోవాలి, వివాదాలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీకున్న తెలివితేటలతో, వాక్చాతుర్యంతో వాటిని అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థినీ విద్యార్థులకు ఇది పరీక్షా కాలం కాబట్టి చదువు పైన శ్రద్ధ వహించండి. బుధవారం రోజున వినాయకుడిని గరికతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా అలాగే వ్యాపారంలో కూడా మీరు అనుకున్న లాభాలు వస్తాయి, మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. మీ కృషి పట్టుదల ఎంతగానో ఉపయోగపడుతుంది, నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ధనం పొదుపు విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏదైనా ఒక సంబంధం కుదిరితే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొంత ఓపికతో కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు శివాలయంలో అభిషేకం చేయించి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మనం ముందుకు వెళుతుంటే వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. మీరు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి అయినప్పటికీ వ్యాపార పరంగా మీరు అనుకున్న అభివృద్ధిని సాధించగలుగుతారు. కొన్ని నూతన అవకాశాలు మీ వరకు వచ్చి చేజారి పోయే అవకాశం ఉంది కాబట్టి మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకండి. సంతాన పురోగతి బాగుంటుంది వారి అభివృద్ధి మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏలిన నాటి శని వెళ్ళిపోతుంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచే చేస్తాడు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ జీవిత భాగస్వామి సలహాలు సూచనలతో వాటిని అధిగమించగలుగుతారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడతారు. కెరియర్ పరంగా మీరు అనుకున్న అభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదివితే భవిష్యత్తు అనేది బాగుంటుంది. విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంగళవారం మరియు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు నీలిరంగు.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చిన్నచిన్న ఇబ్బందులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఏ పని చేపట్టిన గాని అందులో ఫలితాలు మాత్రం చాలా లేటుగా వస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం తప్పక లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారు. ఆ భగవంతుడి మీద భారం వేసి మీ వంతు ప్రయత్నం చేస్తారు, దైవానుగ్రహం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి పక్కన పెట్టండి. సీఏ చదివే వారికి వైద్య వృత్తిలో ఉన్నవారికి మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.

మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు ఇన్ని రోజులు మీరు పడిన కష్టానికి ఈ వారం మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడం కంటే కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే సర్దుకుపోవడం మంచిది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. పొదుపు విషయంలో విజయం సాధిస్తారు. ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి. కెరియర్ పరంగా
ఉన్న చిన్న ఇబ్బందులు ఏవైనా సరే ఈ వారాంతంలో తొలగిపోతాయి. విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టేఫలి అన్నట్టుగా మీ ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని వారికి మంచి అవకాశం లభిస్తుంది. కీలకమైన విషయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏ పనులు చేయరు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణిని అవలంబించరు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ప్రస్తుతం ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.