Today Horoscope February 15: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వ్యాపారాల్లో అధిక లాభాలు!
![Today Horoscope February 15: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వ్యాపారాల్లో అధిక లాభాలు!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/feb-15.webp)
Horoscope Today in Telugu February 14: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు సరైనవే అయినప్పటికీ కార్యక్రమాలలో జాప్యం చోటు చేసుకుంటుంది.
వృషభం – కుటుంబ ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు.టెండర్స్ అతి కష్టం మీద అనుకూలిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మిథునం – కుటుంబంలోని వృద్ధులకు సంబంధించిన పెన్షన్ విషయంలో తాత్కాలికమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటకం – రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది.
సింహం – గోరంతలు కొండంతలు కాకుండా జాగ్రత్తలు వహించండి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య – ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూల పరచుకొనవలసి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడి లోనవుతారు. ఆర్థిక కొంత పరిస్థితి మెరుగుపడుతుంది.
తుల – ఉద్యోగాలపరంగా పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మీరు అడిగే సెలవులు కార్యాలయాలలో లభించకపోవడం లోటుగా కనిపిస్తుంది.
వృశ్చికం – మీ మంచితనం మీకు శ్రీరామరక్ష అవుతుంది. అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని విధానపరంగా లాభపడగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు.
ధనుస్సు – నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. న్యాయవాదులతోటి చర్చలు సాగిస్తారు. చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార కేంద్రాలలో అధిక లాభాలను అందుకోగలుగుతారు.
మకరం – దైనందిన కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు చేసే సూచనలున్నాయి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. అనుకొని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.
కుంభం – వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నతిని సాధించడానికి దృష్టిని సారిస్తారు. ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు.
మీనం – ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు పాటించండి.