Last Updated:

KTR Comments: మూడోసారి మనదే జయం..! ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం..!: కేటీఆర్

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!మూడోసారి మనదే జయం..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR Comments: మూడోసారి మనదే జయం..!  ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం..!: కేటీఆర్

KTR Comments:  తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..! భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..! రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!మూడోసారి మనదే జయం..! అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

హ్యాట్రిక్ విక్టరీ ఖరారు..(KTR Comments)

డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో ముచ్చటగా మూడోసారి గెలిచేది, మనసున్న ముఖ్యమంత్రి కేసిఆరేనని కేటీఆర్ అన్నారు. దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం, దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం.. పదేండ్ల ప్రగతి మా పాశు పతాస్త్రం.. విశ్వసనీయతే మా విజయ మంత్రమని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనం.. ప్రతిఘాతుక ప్రతిపక్షాలకు తప్పదు మళ్లీ పరాభవమని కేటీఆర్ చెప్పారు. మా కెప్టెన్ కేసీఆర్.. అందుకే మా టీంలో హుషారు, హ్యాట్రిక్ విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారని కేటీఆర్ అన్నారు. మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు
ముంచే పార్టీలపై తప్పదు వేటని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. గులాబీ శ్రేణుల సమరోత్సహంతో కదం తొక్కుతోంది తెలంగాణ నేల అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ అస్త్రసన్యాసం..

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు గుండె గుండెలో ఎగురుతోంది మన గులాబీ జెండా.. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్పఈ గడ్డపై గాడ్సే రాద్దాంతం నడవదని కేటీఆర్ బిజెపిని హెచ్చరించారు. 2014 లో తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించింది.. ఉద్యమ చైతన్యం 2018 లో రెండో ఎన్నికను గెలిపించింది.. సంక్షేమ సంబురమన్నారు. 2023 లో మూడో ఎన్నికను శాసించేది.. ముమ్మాటికీ… మన పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానమేనని కేటీఆర్ పార్టీ శ్రేణులకి తెలిపారు. సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధం, యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం, పోటీకి ముందే పూర్తిగా కాడి పడేసిన కమలం అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తన పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఅర్ఎస్ తోనే తెలంగాణ చరిత, కేసిఆర్ గారితోనే తెలంగాణకు భవితని కేటీతఆర్ అన్నారు. అఖండ విజయం మనదే అంటూ కార్యకర్తల్లో కేటీఆర్ ధైర్యం నింపారు.