Last Updated:

Telangana High Court: బండి సంజయ్‌కి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు

Telangana High Court: బండి సంజయ్‌కి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Hyderabad: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు ఈ నెల 23న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నిన్న హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం విచారణను నేటి ఉదయానికి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విషయమై ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై హైద్రాబాద్ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలో బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. అనంతరం ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 27న ప్రజాసంగ్రామయాత్ర ముగుస్తుంది. ఈ సందర్బంగా జరిగే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి: