Home / తెలంగాణ
కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. అంతకుముందు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Ashada Bonalu 2023: ఆషాడమాసం వచ్చేసింది. కొత్త పెళ్లికూతుర్లు అయితే పుట్టింటికి చేరారు. అంతే కాదండోయ్ ఆషాడం అనగానే బాగా గుర్తొచ్చేవి బోనాలు. తెలంగాణ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బోనాలకు యావత్ రాష్ట్రం ముస్తాబవుతోంది.
హైదరాబాద్లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
Monsoon Weather Update: తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తొలకరి చినుకులతో తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన చిరు జల్లులతో నేల పరవసించిపోయింది. ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో నిత్యం వార్తల్లో ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ తెరకెక్కారు. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధించారని గతంలో సంచలన ఆరోపణలు చేసిన జానకీపురం సర్పంచ్ నవ్య మళ్ళీ మీడియా ముందుకి వచ్చారు
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్కి రావాలని పిలిచింది.
Gaddar: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ప్రజాగాయకుడు గద్దర్ పేరు తెలియని వారుండరు. తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఉండే గద్దర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గద్దర్ ప్రజా పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై సమాలోచనలు చేశారు. ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైన వేళ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.