Home / తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని..
సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. అలానే రెండు బొలెరో వాహనాలను సీజ్ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం జరుగుతుంది.
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష్ అనే యువతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేశాయి.
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.
మంత్రి కేటీఆర్ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఇక్కడ మోదీని గూండా అని తిట్టి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటారంటూ ఎద్దేవా చేసారు.
కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటి దాడులపై తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ రెడ్డి బిఆర్ఎస్- బిజెపిని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రాన్ని గణనీయమైన అభివృద్ది దిశగా నడిపించిందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ( కేటీఆర్ ) చెప్పారు. గత పదేళల్లలో తెలంగాణ రూపురేఖలు ఎలా మారాయనే దానిపై ఆయన గురువారం ఐటిసి కాకతీయ హోటల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.