Home / తెలంగాణ
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
:నేడు పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభలో సేనాని పాల్గొననున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు మద్దతుగా సభ ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పరిస్థితులన్నీ వాడి వేడిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో "సదర్" కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ
తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలుచున్న అభ్యర్దులందరిలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డని వార్తలు వచ్చాయి. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేకానంద నిలిచారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.