Last Updated:

Minister KTR: తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రాన్ని గణనీయమైన అభివృద్ది దిశగా నడిపించిందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ( కేటీఆర్ ) చెప్పారు. గత పదేళల్లలో తెలంగాణ రూపురేఖలు ఎలా మారాయనే దానిపై ఆయన గురువారం ఐటిసి కాకతీయ హోటల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.

Minister KTR: తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

 Minister KTR: బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రాన్ని గణనీయమైన అభివృద్ది దిశగా నడిపించిందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ( కేటీఆర్ ) చెప్పారు. గత పదేళల్లలో తెలంగాణ రూపురేఖలు ఎలా మారాయనే దానిపై ఆయన గురువారం ఐటిసి కాకతీయ హోటల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.

వరి ఉత్పత్తిలో రెండవ స్దానం..( Minister KTR)

నేడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు తమ పేర్లను మార్చి అమలు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. మన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ మిషన్ భగీరథ ‘హర్ ఘర్ జల్’గా మారిందన్నారు. . ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కింద మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై మాట్లాడుతూ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఒక్కోసారి సమస్యలు ఎదురవుతాయన్నారు. . మూడు బ్యారేజీలు మరియు 20 లిఫ్టులు మరియు వందల కొద్దీ కాలువలు మరియు సొరంగాలు ఉన్న భారీ ప్రాజెక్టులో మేడిగడ్డ భాగమేనని ఆయన గుర్తు చేశారు. భారీ ప్రాజెక్టుల్లో ఇంజనీరింగ్ లోపాలు తలెత్తడం సాధారణంగా జరిగే విషయమన్నారు.నాగార్జునసాగర్, శ్రీశైలం, కడెం ప్రాజెక్టుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులు పకడ్బందీగా నడుస్తున్నాయని, 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయవద్దని కోరారు. ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడకుండా మేడిగడ్డలోని కుంగిపోయిన భాగాన్ని నిర్మాణ సంస్థ మరమ్మతులు చేస్తుందని హామీ ఇచ్చారు. మరో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి సిద్ధమవుతోందని దీనితో దక్షిణ తెలంగాణ లోమరో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.మేము ఈ ప్రాజెక్టులను కేంద్రం నుండి ఎటువంటి సహాయం లేకుండానే చేపట్టాము. నదీజలాలలో మనకున్న న్యాయబద్ధమైన వాటాను మంజూరు చేయడానికి విముఖత చూపుతున్న ప్రభుత్వం కేంద్రంలో ఉందిని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రూ.1,24,104 నుంచి రూ.3,17,115కు పెరిగిందని, స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.5.05 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. బహుమితీయ పేదరికాన్ని 13.18 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది. అదేవిధంగా 3.5 కోట్ల టన్నుల ఉత్పత్తితో వరి ఉత్పత్తిలో పంజాబ్‌ తర్వాతి స్థానంలో ఉన్నామని ఆయన చెప్పారు.

జాతీయ సగటు కంటే ఎక్కువ..

కొన్ని జిల్లాల నుండి వ్యవసాయ కూలీల వలసలను తెలంగాణ ఎలా అరికట్టిందో వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను కరువు రహితంగా మార్చిందని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు ఐక్యరాజ్యసమితి నల్గొండను మానవ నివాసానికి తగని ప్రాంతంగా వర్గీకరించింది. తెలంగాణ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలు చాలా వెనుకబడినందున బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ కింద ప్రత్యేక గ్రాంట్లు అందించబడ్డాయి. ఇప్పుడు మేము పరిస్దితి మార్చాము. నేడు తెలంగాణలోని అన్ని జిల్లాల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. రాత్రింబవళ్లు నాణ్యమైన విద్యుత్తు, రైతు బంధు ఆర్థిక సహాయం, రైతు బీమా బీమా, ఆకుపచ్చ, గులాబీ, నీలం, తెలుపు, పసుపు సహా ఐదు విప్లవాలు అందించామని కేటీఆర్ చెప్పారు. విప్లవాలు జీవనాధారమైన వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా మార్చాయి. దామరచర్ల థర్మల్ యూనిట్ పని ప్రారంభించిన తర్వాత తెలంగాణ 24,000 మెగావాట్ల ఉత్పత్తిని సాధిస్తుందని తెలిపారు. ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ వంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఆసరా పింఛన్లు, కేజీ టు పీజీ విద్య, 34 వైద్య కళాశాలల ఏర్పాటు, 10 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసారు. గడచిన పదేళ్లలో ఏ రంగాన్ని విస్మరించలేదన్నారు. బీఆర్‌ఎస్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు రాష్ట్రం సాధించిన అభివృద్ధిని పోల్చి చూడాలని ఓటర్లను కోరారు.