Home / తెలంగాణ
హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ ఆస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తెలంగాణ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీ లను విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.
తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె ప్రతిపాదనని విరమించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. పెరిగిన ప్రయాణీకులతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు.
వైఎస్ షర్మిల బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ పంపుల వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో జొమాటో లోగో ఉన్న బ్యాగ్‌తో నగరంలోని వీధుల్లో ఒక వ్యక్తి గుర్రంపై దూసుకుపోతున్న వీడియో వైరల్‌గా మారింది. . చిన్న క్లిప్‌లో జోమాటో డెలివరీ ఏజెంట్ గుర్రంపై చంచల్‌గూడ వద్దకు ఫుడ్ డెలివరీకి వచ్చినట్లు చూపించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
మెట్రో,ఫార్మాసిటీలను రద్దు చేయడంలేదని అయితే ప్రజాప్రయోజనాలకోసం స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సందర్బంగా ఈ విషయాలను వెల్లడించారు.
తెలంగాణలో ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఆబ్కారీ శాఖ పంట పండింది. ఒక్కరోజే మద్యం ప్రియులు దుమ్ము లేపారు. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధనకోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.