Home / తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ (జిహెచ్ఎంసి) రోనాల్డ్ రోస్తో సహా తెలంగాణలోని పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. గత కొద్ది రోజులకిందట పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా ఆపుడు ఏకంగా 44 మంది అధికారులను బదిలీ చేయడం విశేషం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ పోచారం నివాసాన్ని సందర్శించారు
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా బస్‌పాస్‌ను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో జన్మించిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ను అందించే గత విధానాన్ని కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈవో వెంకటేశ్వరరావు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో బేటీ అయ్యారు. ఈ సందర్బంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ కారు యాక్సిడెంట్ కేసులో హైకోర్టు బెయిల్ మంజురుకు నిరాకరించింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు ప్రమాదంలో షకీల్ కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. వీరు ఇద్దరు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితను కలుసుకుని పరామర్శించారు.
క్రికెట్ బెట్టింగ్ విన్నాం..... రాజకీయాల్లో ఏ నాయకుడు గెలుస్తాడో చేసిన చాలెంజ్ లు విన్నాం. కానీ వినూత్నంగా ఐదేళ్ల క్రితం ఓ ఆడపడుచు చంద్రబాబు గెలుస్తాడని కుటుంబసభ్యులతో చాలెంజ్ చేసింది.