Home / తెలంగాణ
కేంద్రం మాదిరిగా సంపదను మిత్రులకు కాదు పేదలకు పంచిపెడుతున్నామని గుర్తించుకోవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించారు.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.
సిఎం కెసిఆర్ పేస్కేల్ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విఆర్ఏలను ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకొంటున్నారు
సికింద్రాబాద్, అడ్డగుట్టలో నిన్నటిదినం రాత్రి రూబీ లాడ్జి ఎలక్ట్రిక్ స్కూటర్ల దుకాణంలో చోటుచేసుకొన్న ఘటనను నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ దురదృష్టకరంగా పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
భారత్ జోడో యాత్రతో భాజాపా దేశంలో పెద్ద చర్చనే లేవదీసింది. అది కాస్తా రాష్ట్రాలకు కూడా పాకింది. తాజాగా తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో కాంగ్రెస్ శాసనసభ్యులు జగ్గారెడ్డి వేసుకొన్న షర్ట్ పై ఆసక్తికర సంభాషణ సాగింది.
చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అంతకుమించి మరీ అసభ్య పదజాలాలు ఇది నేటి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఉచ్ఛరిస్తున్న మాటలు. శాసనసభ హుందాతనాన్ని మరిచి మరీ రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూనే పొరుగు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కిన ఘటన తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకొనింది.
రాష్ట్రంలో విగ్రహాల ఏర్పాట్ల పిచ్చి ఎక్కువైపోతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మహానుభావులను స్మరించుకోవాల్సిన రాజకీయ పార్టీలు తమ దివంగత నేతల్ని విగ్రహాల రూపంలో ప్రతిష్టిస్తున్నారు. వివాదస్పద ప్రాంతాల్లో సైతం నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.
పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
శాసన సభ సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. కాగా నేడు అసెంబ్లీ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేస్తూ సభాపతి ఉత్తర్వులు జారీ చేశారు.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.