Last Updated:

Telangana: ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు. ని. చికిత్సలు వికటించి నలుగురు మహిళల మృతి

ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు.

Telangana: ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు. ని. చికిత్సలు వికటించి నలుగురు మహిళల మృతి

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు.

మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు. దీనితో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు.

ఇవి కూడా చదవండి: