Last Updated:

Malakpet: కలకలం.. హైదరాబాద్ లో మెుండెం లేని మహిళ తల లభ్యం

Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.

Malakpet: కలకలం.. హైదరాబాద్ లో మెుండెం లేని మహిళ తల లభ్యం

Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. తాజాగా మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కలకలం రేపింది.
మెుండెం లేని తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

దారుణం..

హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. తాజాగా మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కలకలం రేపింది.
మెుండెం లేని తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

గత ఆరునెలలుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలు వరుస హత్యలకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగల గూడ మూసి పరివాహక ప్రాంతంలో ఒక నల్లటి కవర్‌లో గుర్తు తెలియని మహిళ తల లభ్యం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు.. మలక్‌పేట్‌ పోలీసులకు సమాచారం అందించారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇలాంటి ఘటనలే ఈ మధ్యన ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా వివాహేతర సంబంధాలు.. కుటుంబ కలహాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.