Last Updated:

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.

Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులు.

ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు అంబులెన్సు సహాయంతో క్షతగాత్రులను స్థానిక గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. లారీ ఢీకొనడంతో ఆటో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.

దీంతో మృతుల్లో ఎక్కువగా ఆటో ముందు భాగంలో కూర్చున్నవారు ఉన్నారు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా మిర్చి కూలీ పనులకు ఆటోలో వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన పొందుగల ప్రాంతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం.