Last Updated:

Heavy Rains: పాడి ఆవులను పొట్టనపెట్టుకున్న పిడుగు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.

Heavy Rains: పాడి ఆవులను పొట్టనపెట్టుకున్న పిడుగు

Peddapalli District: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పిడుగుపాటుకు పాడిఆవులు మృతిచెందాయి. కుక్కలగూడూరులో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దానితో కందుల ఆగయ్య అనే రైతుకు చెందిన 9 ఆవులు, ఒక లేగ దూడ చనిపోయాయి. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మూగజీవాలకు పంచనామా నిర్వహించారు. తమ బ్రతుకుదెరువు అయిన పాడి ఆవులను కోల్పోవడంతో రైతు ఆగయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తమకు తీవ్ర నష్టం కలిగిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు కోరాడు.

మరో రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదారాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఇప్పటికే పలు ప్రాంతాలు జలదిగ్బందంలో కూరుకుపోయి ఉన్నాయి. కురుస్తున్న భారీ వర్షాలతో తిండి గూడు లేక మానవాలితో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి.

ఇదీ చదవండి: సాగర్ ఎడమ కాల్వకు గండి.. నీటమునిగిన నిడమానూరు..!

ఇవి కూడా చదవండి: