Last Updated:

Secunderabad Fire Accident: విద్యుత్ బైకుల ఘటన పై కేంద్రం విచారణ

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుతున్న ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ లోని రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది

Secunderabad Fire Accident: విద్యుత్ బైకుల ఘటన పై కేంద్రం విచారణ

Secunderabad: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుతున్న ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. సికింద్రాబాద్‌ లోని రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల ఘటన పై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ప్రత్యేక కమిటీ ఈ బైక్ పేలుళ్లపై విచారణ జరుపనుంది. బ్యాటరీలు ఎందుకు పేలాయి. సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అనే కోణంలో విచారణ జరపనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

కాగా, రూబీఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో ఈనెల 12న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. గోదాములోని ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న నాలుగు అంతస్ధుల రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 25 మంది బస చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

వ్యాపార సంస్ధలు నిర్వహిస్తున్న అనేక రంగాలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉండడంతో వ్యాపారస్ధులు ప్రామాణికాలు పాటించడం లేదు. భవనాలకు అనుమతి ఇచ్చే సమయంలో అగ్రిమాపక అధికారులు ఖచ్ఛితంగా పరిశీలించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్యాస్, విద్యుత్, పెట్రోల్ వంటి వ్యాపార సంస్ధలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. రాజకీయ జోక్యంతో ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో అనుకోని సంఘటనల్లో సామాన్యులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి: