Last Updated:

CM Convoy: కాన్వాయ్ మార్గంలో వెళ్లిన మహిళ పై కేసు

సీఎం క్యాన్వాయా మజాకా. ఏ మార్గంలోనైనా సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆ మార్గంలో పాదచారులకు, వాహనదారులకు తిప్పలు ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాదులోని ప్రధాన రహదారుల్లో అయితే ఇక ప్రజల పడే నరకం అంతా ఇంత కాదు. కాన్వాయ్ వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో వెళ్లిన కారణంగా ఓ మహిళ పై కేసు నమోదైన ఘటన తెలంగాణ విమోచన దినం నాడు చోటుచేసుకొనింది.

CM Convoy: కాన్వాయ్ మార్గంలో వెళ్లిన మహిళ పై కేసు

Hyderabad: పోలీసుల సమాచారం మేరకు, ఈ నెల 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవాల సభ అనంతరం సీఎం కేసిఆర్ రాజ్ భవన్ రహదారి మీదుగా ప్రగతి భవన్ కు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ప్రధాన రహదారిపైకి వచ్చే వాహనాలను ఆపుతున్న సమయంలో ఓ కారును పోలీసులు ఆపారు. అత్యవసరంగా వెళ్లాలని పోలీసులతో పేర్కొంటూ కారులోని మహిళ కారు దిగి రోడ్డుమార్గంలో చక చకా నడుచుకుంటూ వెళ్లింది. వీవీఐపి వస్తున్నారు, వెళ్లొద్దని డ్యూటీ కానిస్టేబుల్ వారించాడు. మహిళను అడ్డుకొనేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు.

విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు డ్యూటీ కానిస్టేబుల్ పై అసభ్య పదజాలంతో దూషించిందంటూ పోలీసులు ఆమె పై కేసు నమోదు చేశారు. రోడ్డు మార్గంలో మహిళతో జరిగిన సంభాషణను డ్యూటీ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి వున్నారు.

ఇవి కూడా చదవండి: