Bandi Sanjay: మరోసారి బండి సంజయ్ కు సిట్ నోటీసులు
Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
మరోసారి నోటీసులు..
బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు.
వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై సమాచారం ఇవ్వాలని సిట్ ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24 న విచారణకు రావాలని పేర్కొంది.
అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. దీంతో తాజాగా ఆయనకు మరోసారి.. నోటీసులు అందించారు.
ఈ నెల 26న సిట్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇవాల బండి సంజయ్ ఇంటికి వెళ్లి సిట్ ఇన్ స్పెక్టర్ స్వయంగా నోటీసులు అందజేశారు.
రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపారు.
గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశంలో సంజయ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలి పై అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు.
అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
దీంతో ఆరోపణలకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను అందజేయాలంటూ గతంలోనే సంజయ్ కి నోటిసులు ఇచ్చింది సిట్.
పార్లమెంటు సమావేశాలు ఉండటంతో సిట్ ముందు విచారణకు హాజరు కాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని, ఏ ఇంటికి సిట్ నోటీసులు అంటించిందో తెలియదంటూ సంజయ్ పేర్కొన్నారు. దీంతో మరోసారి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది.
సిట్ పై నమ్మకం లేదు..
సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్.. విచారణకు హాజరు కాలేదు. అయితే సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని ఆయన అన్నారు.
తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోలేనని అన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే ఉన్న సమాచారం ఇస్తానని తెలిపారు.