Fatty Liver: యువకులలో ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. ఇలా తగ్గించుకోండి!
Fatty Liver: ఫ్యాటీ లివర్.. ఇప్పటి యువతలో ఎక్కువగా కనపడుతున్న ప్రమాదకరమైన జబ్బు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో భారతదేశంలోని 80 శాతం ఐటీ నిపుణులు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారని తేలింది. పని ఒత్తిడి, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ వస్తుందని తేలింది. ఇది వాళ్లకు కూడా తెలయడం లేదు. అనుకోకుండా తీసుకున్న టెస్టులలో వెలుగు చూస్తుంది.
ఢిల్లీలో పని చేస్తున్న 24 ఏళ్ల వర్కింగ్ ప్రొఫెషనల్ అష్నా గుప్తాకు, ఫ్యాటీ లివర్ ఉన్నట్లు అనుకోకుండా బయటపడింది. ఆమె పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి కారణంగా గైనకాలజిస్ట్‌ను సందర్శించింది, ఇది UTI వల్ల వచ్చింది. అయితే, ఆమెకు PCOD (మహిళల్లో పెరుగుతున్న మరో ఆందోళన) ఉందని మాత్రమే నిర్ధారించిన స్కాన్ సమయంలో, ఆమెకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందని కూడా వెల్లడైంది.
తన జీవనశైలి మెరుగ్గా ఉంది, అప్పుడప్పుడు చీట్ మీల్స్ మరియు ఆల్కహాల్ తీసుకున్నట్లు ఆమె చెప్పింది, అయినప్పటికీ రోగ నిర్ధారణ చూసి ఆశ్చర్యపోయింది. ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ… భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఇది చాలా సాధారణమని అన్నారు. తాను దాదాపు ప్రతిరోజూ ఫ్యాటీ లివర్ ఉన్న లెక్కలేనన్ని కేసులను చూస్తున్నట్లు చెప్పారు.
ఫరీదాబాద్‌లోని మెట్రో హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు హెపాటోబిలియరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా మాట్లాడుతూ, “సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలో ఫ్యాటీ లివర్ కేసులు తరచుగా బయటపడతాయని అన్నారు. జనాభాలో 30-40 శాతం మంది ఏదో ఒక రకమైన ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని 80 శాతం ఐటీ నిపుణులకు పని ఒత్తిడి, పేలవమైన జీవనశైలిల కారణంగా ఫ్యాటీ లివర్ వస్తుందని అధ్యయనంలో తేలినట్లు చెప్పారు.
ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంపై అధిక కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. దీనిని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) మరియు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD).
మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ మరియు పిత్త శాస్త్రాలు, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ మరియు ఎండోస్కోపీ ప్రిన్సిపల్ డైరెక్టర్ మరియు హెడ్ డాక్టర్ సంజీవ్ సైగల్ మాట్లాడుతూ… ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైనది కాదని అన్నారు. దీని ఎదుగుదల నాలుగు దశలు ఉంటుందన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తే తగ్గించడం సులభమని చెప్పారు. ఫ్యాటీ లివర్ కు కారణం.. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ అని అన్నారు.
లివర్ ఎందుకు ఫ్యాట్ గా మారుతుంది ?
ఫ్యాటీ లివర్ అనేది జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లతో ముడిపడి ఉంది. కొవ్వు మరియు ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కారమన్నారు డాక్టర్లు. వ్యాయామం చేయకుండా కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేస్తుండటం కూడా ఫ్యాటీ లివర్ కు కారణం. . పిజ్జాలు బర్గర్ లు అతిగా తినడంతో ఫ్యాటీ లివర్ వస్తుంది.
ఫ్యాటీ లివర్ వచ్చిందనడానికి సూచనలు
నిరంతరం అలసట రావడం, బలహీనత, పొట్ట కుడి భాగంలో నొప్పి, అసౌకర్యంగా అనిపించడం, బరువు తగ్గడం,
పొత్తికడుపులో వాపు (అస్సైట్స్), పచ్చ కామెర్లు (తీవ్రమైన సందర్భాల్లో చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం)
, ముదురు మూత్రం, లేత మలం వంటి లక్షణాలు రెగ్యులర్ గా ఉంటే ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
ముఖ్యంగా శరీరానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని జంక్ ఫుడ్ కు అతి మధ్యపానానికి జనాలు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఊబకాయం రాకుండా సాంప్రదాయమైన భోజనానికి ప్రియారిటీ ఇవ్వాలని ఆహారంలో జొన్న రొట్టె లాంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.