New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని ప్రజలకు సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని ప్రజలకు సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి..(New Year Celebrations)
ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన తీసుకుంటాం. వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత లిక్కర్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఈవెంట్‌లో సెక్యూరిటీ తప్పనిసరి చేశారు. సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని హెచ్చరించారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తపడాలని పోలీసులు కోరారు. మద్యాన్ని అనుమతించే ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.