Home / ప్రాంతీయం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యమైనట్లు కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయన భార్య ఫిర్యాదు చేశారు. నర్సాపురం మాధవాయిపాలెం ఫెర్రి పాటదారుడి నుంచి బకాయిలు వసూళ్ల విషయంలో ఒత్తిడికి గురైన ఎంపీడీవో రమణారావు.. జులై మూడో తేదీ నుంచి మెడికల్ లీవ్‌పై వెళ్లారు.
గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్‌ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది
ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఈ మేరకు సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ విద్యుత్ విచారణ కమీషన్హ పై మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నర్సింహారెడ్డి స్థానంలో కొత్త వారిని ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం భూములు, ఖనిజాలు దోచుకుందని ఆరోపించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.