Home / ప్రాంతీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థణల అనంతరం సచివాలయంలోని బ్లాక్ 2లో తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐటీఐ)లను అత్యాధునిక శిక్షణా సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. వీరు ఇద్దరు ఢిల్లీ వెళ్లి జైలులో ఉన్న కవితను కలుసుకుని పరామర్శించారు.
ఈవీఎంలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్ ఎక్స్ లో తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు తప్ప ఈవీఎంలు కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించింది. వై ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ కోసం ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.
తాము అధికారంలో ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం పూర్తయిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 7 మండలాలను కలపడంతోనే ప్రాజెక్టు ముందుకు సాగిందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును ఇబ్బందులు పాలుజేసిందని అన్నారు.
క్రికెట్ బెట్టింగ్ విన్నాం..... రాజకీయాల్లో ఏ నాయకుడు గెలుస్తాడో చేసిన చాలెంజ్ లు విన్నాం. కానీ వినూత్నంగా ఐదేళ్ల క్రితం ఓ ఆడపడుచు చంద్రబాబు గెలుస్తాడని కుటుంబసభ్యులతో చాలెంజ్ చేసింది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంనుంచి అయ్యన్న ఏడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
ఆ ఊరులో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుతీర్చుకుంటే మాములు విషయమే కదా అని అనుకుంటే పొరపాటే ..ఆ మొక్కుకు ఒక లెక్కవుంది