Last Updated:

Corporator Arrest: ఫేక్ డాక్యుమెంట్లతో 90 కోట్లు వసూళ్లు.. మీర్ పేట్ కార్పోరేటర్ అరెస్ట్

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన మీర్ పేట్ కార్పొరేటర్ నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Corporator Arrest: ఫేక్ డాక్యుమెంట్లతో 90 కోట్లు వసూళ్లు.. మీర్ పేట్ కార్పోరేటర్  అరెస్ట్

Corporator Arrest: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన మీర్ పేట్ కార్పొరేటర్ నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బాగంగానే.. చంపా పేట్ కి చెందిన జగదీశ్వర్ రెడ్డి, వద్ద 13 కోట్లు, తీసుకొని రావిరాల వద్ద ఫేక్ డాక్యుమెంట్ ల్యాండ్ అగ్రిమెంట్ చేశాడు. కృష్ణ అనే మరో వ్యక్తి వద్ద 5 కోట్లు తీసుకొని కల్వకుర్తి వద్ద అతనికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అగ్రిమెంట్ చేశాడు. ఇలాగే కరుణాకర్ అనే వ్యక్తి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడని, జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతులను బ్లాక్ మెయిల్ ..(Corporator Arrest)

బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందకుమార్‌ను తిరుపతిలో అరెస్ట్ చేశారు. గతంలో పలువురు రైతుల వద్ద పట్టాదారు పాస్ బుక్కులు తీసుకొని బ్లాక్ మెయిల్ చేశారని సైతం బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. వడ్డీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా రైతులను కూడా వేధించారని ఆయన ఆరోపించారు. విచారణలో మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నందకుమార్ చేతిలో మోసపోయిన మరికొంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నందకుమార్ బీజేపీ తరపున కార్పోరేటర్ గా గెలిచి తరువాత బీఆర్ఎస్ లోకి వెళ్లాడు. ఎంపీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాడని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి: