Last Updated:

Chandrababu-Pawan Kalyan Photos: ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఫోటోలు..

తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించింది .

Chandrababu-Pawan Kalyan Photos: ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఫోటోలు..

Chandrababu-Pawan Kalyan Photos: తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించింది . సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫొటో ఉంటుంది. కానీ ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు .దింతో ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది . ఇప్పటి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరి ఫొటోలు ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో దర్శనం ఇవ్వనున్నాయి.

సమాన హోదా.. ఆశించిన గౌరవం..(Chandrababu-Pawan Kalyan Photos)

ఈ మేరకు సమాచార పౌర సంబంధాల అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తనతో సమానంగా హోదా ఇవ్వడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు నుండి పవన్ కళ్యాణ్ పదవి ఏదైనా కానీ తనతో సమానమే అని చెప్పినట్లుగానే ఇప్పుడు సమాన హోదా కల్పించటం పట్ల జనసైనికులు,టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: