Last Updated:

Group-1 Candidates : తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్.. ఎందుకంటే?

Group-1 Candidates : తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్.. ఎందుకంటే?

Group-1 Candidates : గ్రూప్-1 అభ్యర్థులు ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ వేశారు. గ్రూప్‌-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జక్టులు ఉంటే, 12 సబ్జక్టుల నిపుణులతోనే దిద్దించారని పేర్కొన్నారు. మూడు భాషల్లో పరీక్ష జరిగినా మంచి నిపుణులతో దిద్దించలేదని వెల్లడించారు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో రెండు భాషల (తెలుగు, ఇంగ్లిష్) పేపర్లు దిద్దించచారని, దీంతో మూల్యాంకణంలో నాణ్యత కొరవడిందన్నారు.

 

 

విచారణ నాలుగు వారాలకు వాయిదా..
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు చెప్పారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ వేయాలని టీజీపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్‌పై తదుపురి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

 

 

ఈ నెలల్లోనే ఫలితాలు విడుదల..
ఈ నెలలోనే గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలతోపాటు గ్రూప్-2, 3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2 రాత పరీక్షల మార్కులు విడుదలయ్యాయి. ఈ నెల 14న గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత సంవత్సరం డిసెంబర్ 15, 16 తేదీల్లో 783 గ్రూప్‌-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,365 గ్రూప్-3 సర్వీస్‌ల పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షలు నిర్వహించింది. గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు జరిగాయి. ఈ నెల 14న గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి: