Home / ప్రాంతీయం
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ సాక్షిగా పటాన్చెరు టీఆర్ఎస్ రాజకీయం రసకందాయంలో పడింది. చిట్కుల్లో జరిగిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు హజరు కాకపోవడం టీఆర్ఎస్లో గ్రూప్ విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారి పై ప్రమాణం చేయాలన్నారు.
పాదయాత్ర కాదు, అది ఒళ్లు బలిసిన యాత్రగా రాజధాని రైతుల పాదయాత్రనుద్ధేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించే విధంగా ఓ ట్వీట్ చేశారు
తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లారు. అక్కడ దళిత బంధు గురించి ప్రశ్నించిన మహిళల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. నన్ను వ్యభిచారి అంటావా? అంటూ అంటూ షర్మిల పై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని, కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు.
తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.