Nara Lokesh: బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారి పై ప్రమాణం చేస్తారా.. జగన్‌కు లోకేష్ సవాల్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారి పై ప్రమాణం చేయాలన్నారు.
Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారి పై ప్రమాణం చేయాలన్నారు. లేదంటే బాబాయ్‌పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదని 14.04.21న తిరుమలలో తాను ప్రమాణం చేశానని లోకేష్ గుర్తుచేశారు. ఇప్పుడు మీ బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ప్రమాణం చేస్తారా అని జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. లేదంటే బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం వైఎస్ జగన్. సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలోని గంగమ్మ తల్లి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలిపిరిలో విద్యుత్ బస్సులను సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత గంటలకు బేడి ఆంజనేయస్వామిని జగన్ దర్శించుకొంటారు. అక్కడి నుండి నేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా?(2/2)#AbbaiKilledBabai
— Lokesh Nara (@naralokesh) September 27, 2022