Home / ప్రాంతీయం
చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పొడిన ఘటన కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు వద్ద చోటుచేసుకొనింది. మానసిక వత్తిడి కారణంగా యువతి చెరువులోకి దూకిన్నట్లు ప్రాధామిక సాక్ష్యాలతో పోలీసులు గుర్తించారు.
రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామంటూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వదంతులను నమ్మవద్దని కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ పోలిసింగ్ అంటున్న ప్రతపక్షాల మాటలు కొన్ని సమయాల్లో అవుననే సమాధానం వస్తుంది. కొంత మంది పోలీసులు రాజకీయ నేతల అండదండలు చూసుకొని మరీ రెచ్చిపోతున్నారు. ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు, వ్యాపార వర్గాలపై వారు తీసుకొంటున్న నిర్ణయాలు ఏకంగా పోలీసు బాస్ మెడకు చుట్టుకొనేలా చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వేదంగా మారిపోయింది. వ్యవస్ధలపై సరైన పట్టు లేకపోవడంతో అధికారులు దోపిడీకి సై..సై.. అంటున్నారు. విచ్చలవిడిగా లంచాలకు పాల్పొడుతూ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రంగారెడ్డి కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. అయితే కవితను న్యాయవాదులు అడ్డుకొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, కోర్టుకు ఎలా వస్తారని కవితను నిలదీసారు.
ఆంధ్రప్రదేశ్ లో విలువైన ఇనుప ఖణిజాలను పరులు పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందని, ఏపి ఎండీసి ద్వార ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ఓబులాపురం గనుల దోపిడి పార్ట్ 2 ప్లాన్ కు వైకాపా ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు
వావి, వరుసలు మరిచాడు. నమ్మకంగా ఉంటూనే మోసం చేసాడు. అంతేనా బరితెగించి మరో క్రిమినల్ వ్యవహారాన్ని చేపట్టాడు. చివరకు ఆ వ్యవహారంపై పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఘటన అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొనింది.
జాతీయపార్టీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ వేగంగా అడుగులేస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ప్రకటన పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.