Home / ప్రాంతీయం
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఏపీ సీఎం జగన్ పక్కాగా వ్యూహరచన చేస్తున్నారట. అందుకోసం సరైన ముహూర్తాన్ని కూడా ఎంచుకుంటున్నారట. అన్ని విధాలుగా అనుకూలమైన డిసెంబర్ నెల బెటర్ అని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్..జనసేనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్లోని కొండాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పనిచేస్తున్న దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.
సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు సహా కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లారు.
కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీనితో ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.
కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని, అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ మారనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం మధ్యాహ్న భోజనంలో మార్పులు చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో నేటి నుంచి కొత్త మెనూను అమలు కానుంది.