Home / ప్రాంతీయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి దాడి చేయడంతో చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు.
ఆచార సంప్రదాయాలకు సనాతన హిందూధర్మానికి పెట్టింది పేరు భారతదేశం. ఇక్కడ దేవుళ్ళనే కాదు ప్రకృతిలోని పశుపక్షాదులు, చెట్లు, చేమలను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం ఉంది. అలాంటి హిందుధర్మంలో దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు భక్తులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ సింగర్ సత్యవతి మంగ్లీ రాథోడ్ ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. తాను రాజీనామా లేఖను పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీతో తన బంధాన్ని తెంచుకుంటున్నానని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్ల కొట్టివేతను తక్షణమే నిలిపేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
కృష్ణా జిల్లాలో ఓ పాస్టర్ వింత చేష్టలు చర్చనీయాంశమయ్యాయి. తాను 10 రోజుల్లో చనిపోయి.. సమాధి నుంచి మళ్లీ మూడో నాడు తిరిగి లేచొస్తానని చెప్పడం స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.