Home / ప్రాంతీయం
గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.
ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదనుకోండి. దానిని ఆసరాగా చేసుకుని కొంత మంది వ్యాపారులు నాణ్యతప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై ఆహార పరిరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిపై మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ వాళ్లు దాడి చేసినపుడు ఎక్కడికి పోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు
కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు.
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా 'ఇదేం కర్మ' అనే కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.