Home / ప్రాంతీయం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు కార్యాలయాలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 400 మందికి పైగా ఐటీ అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. అయితే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మంగళవారం గొత్తి కోయల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగాయి
తమకు ఆయుధాలు ఇస్తేనే డ్యూటీ చేస్తామంటూ ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. అంతవరకు రేపటి నుండి విదులు బహిష్కరించాలని ఫారెస్ట్ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాలు అంటే ఒక జవాబుదారీతనం ఉండాలి. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేస్తేనే.. ఆ మంచిని చూసి ప్రజలు ఓటు వేస్తేనే పాలకులు అధికారంలో ఉంటారు.. లేకుంటే అధికారంలో నుంచి పోవాలనే మేసేజ్ పోవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమాక్స్. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా ఈ ఐమాక్స్ థియేటర్ కి పేరుంది. కాగా వీక్షకులకు మరింత పెద్దతెరపై సినిమా చూపించాలని దేశంలోనే అతి పెద్ద తెరను ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నారు.
మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా-రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అంతేకాదు అసభ్యంగా మాట్లడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది.