Home / ప్రాంతీయం
మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అమలు చేయనున్నారు.
మాండూస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంత వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది. కాగా నేడు మాండూస్ బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలు జలదిగ్భంతో చిక్కుకుని ఉన్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. చాలా మంది లోతట్టు ప్రాంత ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా తుఫాను కారణంగా నిరాశ్రయులైన బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇళ్లంతా బంధుమిత్రులు ఎంతో సందడిగా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి మండపానికి రావడానికి నవ వధువు ముస్తాబవుతోంది. ఇంతలోనే ఆ పెళ్లింట ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. పెళ్లిపీటలపై ఉండాల్సిన నవవధువు ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా మారింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకుంది.
గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు చేరుకున్న సీబీఐ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ కాంగ్రెస్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంధం తెగిపోయిందా? ఆయనను పట్టించుకోనవసరం లేదని కాంగ్రెస్ హై కమాండ్ భావించిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బిఆర్ఎస్ గా మార్చడానికి ఎన్నికల కమీషన్ ఆమోదించిన విషయం తెలిసిందే.
మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.