Suzuki Access Electric: ఈవీగా మారిన ఫ్యామిలీ మ్యాన్.. సుజికి యాక్సెస్ ఎలక్ట్రిక్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ..!
Suzuki Access Electric: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. దీని డిజైన్ చాలా స్టైలిష్, స్మార్ట్‌గా ఉంటుంది. సుజుకి దీనిని పెట్రోల్‌తో నడిచే యాక్సెస్ 125 నుండి కొద్దిగా భిన్నంగా ఉంచింది. ఈ స్కూటర్ నేరుగా టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, బజాజ్ చేతక్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్‌లతో పోటీపడుతుంది. దీనితో పాటు, కంపెనీ సుజుకి యాక్సెస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది.
Suzuki Access Electric Features
సుజుకి ఇ-యాక్సెస్ స్కూటర్‌ను మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో తీసుకువచ్చింది, అవి మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం. 2/మెటాలిక్ మాట్ బోర్డియక్స్ రెడ్, పెరల్ గ్రేస్ వైట్/మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే, పెరల్ జేడ్ గ్రీన్/మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రే. యువతకు నచ్చే విధంగా దీని డిజైన్ స్మార్ట్‌గా ఉంటుంది. స్కూటర్ సీటు సౌకర్యవంతంగా ఉంటుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే స్కూటర్‌లో టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, ఇందులో ఓడోమీటర్, రేంజ్, బ్యాటరీ, ట్రిప్‌మీటర్, ఇతర మెయిన్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి రైడ్‌ను సులభతరం చేస్తాయి.
Suzuki Access Electric Specifications
కనెక్టివిటీ ఫీచర్‌లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్, ట్రాఫిక్ అప్‌డేట్‌లు ఉన్నాయి. E-యాక్సెస్‌కు ఎకో, రైడ్ A, రైడ్ B అనే మూడు రైడ్ మోడ్‌లు ఇచ్చారు. దీనికి ఫోబ్ కూడా ఉంది, దానితో మీరు స్కూటర్‌ను రిమోట్‌గా లాక్/అన్‌లాక్ చేయచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని సీటు ఎత్తు 765mm, గ్రౌండ్ క్లియరెన్స్ 165mm, కర్బ్ వెయిట్ 122kg.
Suzuki Access Electric Range
ఈ స్కూటర్‌లో 4.1kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 15Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. అలనే 3.07kWh బ్యాటరీ ప్యాక్‌తో ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 95కిమీల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 71 కి.మీ. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి ఇ-యాక్సెస్‌ను 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.
Suzuki Access Electric Price
సుజుకి ఇ-యాక్సెస్ 2025 చివరిలో ప్రారంభించవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మరి ఈ స్కూటర్‌ను కస్టమర్లు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.