Home / ప్రాంతీయం
MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (మంగళవారం) విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో వివరించారు. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని, నాలుగు రోజుల గడువు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. మండే ఎండాలకు తోడు తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ కారణంగా ముగ్గురు మరణించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్దిదారులకు నగదు జమ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరనున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగినట్లు సమాచారం అందుతుంది. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని
లెజెండరీ నటులు, తెదేపా పార్టీ స్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మే 20న హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుక కార్యక్రమం జరగనుంది. ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి రామకృష్ణ ఆహ్వాన
తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి గుర్తుగా ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం కొంగర కలాన్‌లో జరిగింది.రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
తెలంగాణా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఈ-గరుడ పేరుతో మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
ఓ పదేళ్ల బాలుడు కేవలం ఒక టవల్ చుట్టుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ది కూడా తన తల్లిపై కంప్లైంట్ ఇవ్వడానికి.. చదవడానికి కొంచెం షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. మరి ముఖ్యంగా తన తల్లి పై ఎందుకు ఫిర్యాదు చేయాలని అని అనుకున్నాడో తెలిస్తే ఇక బుర్రపాడు అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది.
స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నేడు ( మే 15, 2023 ) న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. నర్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, అలంపూర్ మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లుగా ప్రమాణం చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 100 వరోజుకు చేరుకుంది. లోకేష్ ఇప్పటికి 1200 కి.మీ. పాదయాత్ర పూర్తి చేసారు. ఈ సందర్బంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్ కు అభినందనలు తెలిపారు.